గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్(Grace Cancer Foundation) ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం దగ్గర గ్లోబ్ గ్రేస్ క్యాన్సర్ రన్(Globe Grace Cancer Run) నిర్వహించారు. ఈ రన్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, షాట్ చైర్మన్ శివసేన రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున విద్యార్థులు, యువత హాజరై.. 2కె, 5కె పరుగులో పాల్గొన్నారు. కాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఈ పరుగు నిర్వహించిన నిర్వాహకులను మంత్రులు అభినందించారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలి.. రన్‌లో పాల్గొన్న విజేతలను అభినందించారు. మన జీవితం నుండి ప్లాస్టిక్‌ను దూరం చేసినప్పుడే క్యాన్సర్ ను నివారించవచ్చన్నారు. క్యాన్సర్ చికిత్స కు ప్రజాపాలన ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.


