Thursday, April 16, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ప్రజాస్వామ్య కామెడీ సర్కస్

Aaj Ki Baath | ప్రజాస్వామ్య కామెడీ సర్కస్

నాడు గులాబీ తీర్థం పుచ్చుకొని గెలిచారు.. నేడు హస్తం నీడన హాయిగా సేదతీరుతున్నారు.. పదిమంది ‘జంపింగ్‌ జీలానీలు’ కండువా మార్చేసి ఓటేసిన జనాన్ని నట్టేట ముంచేశారు!.. ట్విట్టర్‌లో ఫోటోలు పెట్టి మరీ దండలు వేయించుకున్నా ప్రపంచమంతా కేకలు వేసి నిజం చెబుతున్నా.. ‘‘ఎవరూ రాలేదు.. ఎవరూ మారలేదు’’ అన్న స్పీకర్‌ తీర్పు.. సాక్షాత్తూ ఆ బ్రహ్మదేవుడికే దిమ్మతిరిగే అద్భుతం! కళ్ళముందు కనిపిస్తున్నది కొండంత నిజమైతే.. చట్టం చేతిలో ఉన్న భూతద్దం దాన్ని అబద్ధం అంటోంది.. న్యాయం అంటే ‘నువ్వు-నేను’ అనుకునే ఒప్పందం కాదు బాబూ అది అధికార పీఠం ఆడే ‘అందమైన’ దోబూచులాట! రాజ్యాంగం అంటే చదువుకునే పుస్తకం అనుకున్నాం.. కానీ అది పార్టీలు మారే పచ్చని తోరణం అని ఇప్పుడే తెలిసింది.. ఆధారాలు అటకెక్కాయి.. నైతికత నవ్వులపాలైంది.. ప్రజాస్వామ్యం ముసుగులో.. ఇదో సరికొత్త కామెడీ సర్కస్‌!

  • జ్వాల
- Advertisement -
RELATED ARTICLES

Latest News