Friday, February 13, 2026
Homeక్రైమ్ వార్తలుIBomma | ఐబొమ్మ వెబ్‌సైట్ వివరాలివీ..

IBomma | ఐబొమ్మ వెబ్‌సైట్ వివరాలివీ..

ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైన ఐబొమ్మ వివరాలను పోలీసులు వెల్లడించారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌(IBomma Website)ను ఇమంది రవి(Imandi Ravi) వేరే సంస్థ నుంచి హోస్ట్ (Host) చేస్తున్నాడు. డొమైన్‌(Domain)ను ‘ఎన్‌జీల’ కంపెనీలో నమోదు చేశాడు. కంటెంట్ (Content) నిర్వహణ (Management) వ్యవస్థ (System) ద్వారా మూవీస్ (Movies) అప్‌లోడ్ చేసేవాడు. ఐబొమ్మ వెబ్‌సైట్‌తోపాటు బప్పం (Bappam) వెబ్‌సైట్ల ద్వారా కూడా ఫిల్మ్స్ పోస్ట్ చేసేవాడు. సంబంధిత వెబ్‌సాఫ్ట్‌వేర్‌లో రీడైరెక్ట్ స్క్రిప్ట్ రాయటం వల్ల గేమింగ్, బెట్టింగ్ వెబ్‌సైట్లకు వెళుతోంది. ఇమంది రవి కోట్లల్లో సంపాదించాడు. ఫ్యూచర్‌లో వెబ్-3 సాంకేతికత అందుబాటులోకి వస్తే పైరసీని పట్టుకోవటం చాలా కష్టం. రవిని ఆయన భార్య పట్టించిందన్న వార్తలు అబద్ధం. రవి భార్యను పోలీసులు విచారణ జరపలేదు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News