- విధి నిర్వహణ కోసం ఎందరో కుటుంబాలకు దూరం
- సమాజంలో శాంతిభద్రతలతోనే పెట్టుబడుల రాక
- పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల కఠిన వైఖరి
- ఈగిల్, శక్తి విభాగాల ఏర్పాటుతో ఆధునికంగా పోలీస్ శాఖ
- డ్రగ్స్,గంజాయి, ఎర్రచందనం ముఠాల ఆటకట్టేల కృషి
- పోలీస్ అమరుల దినోత్వసం సందర్భంగా చంద్రబాబు నివాళి
ప్రజల రక్షణ కోసం ముందుండేది పోలీసులేనని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విధి నిర్వహణ కారణంగా తమ కుటుంబంతో సరిగా గడపలేని పరిస్థితి వారిదని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని 6వ బెటాలియన్ లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత పోలీసు అమరవీరుల స్తూపం వద్ద సీఎం నివాళులర్పించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ‘అమరులు వారు’ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించి మాట్లాడారు.

1959 అక్టోబర్ 21న మన సీఆర్పీఎఫ్ దళాలు వీరోచిత పోరాటం చేశాయి. చైనా సైనికులపై పోరాడి 10 మంది భద్రతా సిబ్బంది అమరుల య్యారు. వారిని స్మరించుకుంటూ అమరవీరుల సంస్మరణ దినం నిర్విహించు కుంటున్నాం. వారి త్యాగాలను గుర్తుచేసుకుంటూ మనమంతా స్ఫూర్తి పొందుతున్నాం అన్నారు. సమాజంలో అలజడులు ఉంటే పెట్టుబడులు రావు. శాంతిభద్రతల విషయంలో రాజీపడకుండా పనిచేస్తున్నాం. నేరరహిత సమాజం కోసం అందరూ పనిచేయాల్సిన అవసరముందని సిఎం అన్నారు. సాంకేతికంగా పోలీసు శాఖను బలోపేతం చేస్తున్నాం. సైబర్ నేరాలు, వైట్ కాలర్ నేరాలు పెరిగాయి. సీసీ కెమెరాలు, డ్రోన్లు, గూగుల్ టేకౌట్లు విస్తృతంగా ఉపయోగించుకోవాలి.
పోలీసు యంత్రాంగానికి సీసీ కెమెరాలు మూడో కన్నులా పనిచేస్తాయి. ఎవరు, ఎక్కడ, ఏ తప్పు చేసినా ఆధారాలతో పట్టుకునే పరిస్థితి రావాలి. ఈగల్, శక్తి బృందాల ఏర్పాటుతో రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆదర్శంగా నిలిచింది. డ్రగ్స్, గంజాయి స్థావరాలను గుర్తించి ధ్వంసం చేస్తున్నాం. స్మగ్లింగ్ను పోలీసులు అరికడుతున్నారు. ఎర్ర చందనం దొంగల ఆట కట్టిస్తున్నారని అన్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడవద్దు ఈ ఏడాది దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారు. అమరులైన పోలీసుల ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ప్రజల రక్షణ కోసం పోలీసులు తమ ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న పరిస్థితిని చూస్తున్నాం.
ఫ్యాక్షనిజం, నక్సలిజం, రౌడీయిజాన్ని అణచివేయడంలో పోలీసులు మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రజల కోసం పరుగులు పెడుతూ విధులు నిర్వహిస్తున్నారు. తమ సంతోషాన్ని త్యాగం చేసి పోలీసులకు సహ కరిస్తున్న కుటుంబసభ్యులకు సెల్యూట్ చేస్తున్నా. పోలీసులంటే కఠినంగా ఉంటారను కుంటారు. కానీ మానవత్వంతో వ్యవహ రించేది వాళ్లే. విజయవాడలో పిల్లలు చెప్పులు లేకుండా వెళ్తుంటే పెనమలూరు హెడ్కానిస్టేబుల్ చెప్పులు కొనిచ్చారు. ప్రజలు ఆస్తులు కాపాడాలనే తపన పడే సిబ్బంది ఉన్నారు. మానవత్వంతో స్పందించే పోలీసు అధికారులు ఉన్నారని ఈ సందర్భంగా వివరించారు. క్రిమినల్స్ సైబర్ టెక్నాలజీలో అప్డేట్ అవుతు న్నారు. వారి కంటే ముందుండకపోతే నేరాలను కట్టడి చేయలేం. గూగుల్ పెట్టుబడులు రాష్ట్రంపై నమ్మకంతోనే విశాఖకు వచ్చాయి.
ప్రాణం తాత్కాలికం.. చేసే పని శాశ్వతం. సమాజంలో అశాంతి సృష్టించడానికి రాజకీయ ముసుగులో కొత్త నేరాలు చేస్తున్నారు. రాజకీయ కుట్ర, ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. కుల, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతోంది. సోషల్ మీడియా పెద్ద ఛాలెంజ్ మారింది. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. దీనివల్ల ఎంతో మంది కుమిలిపోతున్నారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం.. నేరస్థులపై కఠినంగా ఉండాలి. శాంతి భద్రతల విషయంలో రాజీ పడవద్దు. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాలి. ప్రభుత్వానికి, ప్రజలకి అండగా ఉండాలి.
ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. పోలీసులకు బీమా కల్పించి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. హోంగార్డులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తాం. పోలీసులకు డీఏలతో పాటు సరెండర్ లీవులు ఇస్తున్నాం. 6,100 మంది కానిస్టేబుళ్లను నియమించాం. 2047 నాటికి దేశంలో ఏపీ నంబర్ 1గా ఉండాలి. అన్ని రకాల భద్రత ఉంటేనే ఇది సాధ్యం అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి అనిత, సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
