Saturday, April 18, 2026
Homeఆదిలాబాద్Arrest | గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

Arrest | గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

బెల్లంపల్లి పట్టణంలోని పంచముఖ హనుమాన్ స్టాచ్ వద్ద అక్రమంగా గంజాయి రవాణా చేసిన ఇద్దరు వ్యక్తుల అరెస్టు. చేసి కేసు నమోదు చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు

Cr. No: 72/26 U/Sec 20(b)(ii)(A), 27 of NDPS Act-1984 క్రింద కేసు నమోదు చేసిన బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసులు. సీఐ కె శ్రీనివాస రావు మాట్లాడుతూ గంజాయి వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

- Advertisement -

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.గంజాయి వినియోగం ఆరోగ్యానికి హానికరమేకాకుండా కుటుంబాల్ని, సమాజాన్ని దెబ్బతీస్తుందని పేర్కొంటూ, మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా గంజాయి అక్రమ రవాణా లేదా వినియోగానికి పాల్పడుతున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కేసును చేదించడంలో పాల్గొన్నటువంటి ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఎస్సై తాళ్ల గురజాల రామకృష్ణ, క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి రాజేశ్వరరావు సదానందం మరియు కానిస్టేబుళ్లు దేవేందర్, రాజేష్,రామకృష్ణ హోంగార్డు హాజీలను డిసిపి గారు ప్రశంసించారు. *నిందితుల వివరాలు

A1) ఎండీ. ముజ్జు, s/o late ఎండీ. మహామూద్, వయస్సు 25 సo”లు
కులం : ముస్లిం, వృత్తి: ఆటో డ్రైవర్
r/o caltex, బెల్లంపల్లి.

A2). మైనర్
పరారీలో ఉన్న నిందితుల వివరాలు :

A3) స్. కె ఫారజానా,w/ o late మహమూద్, వయస్సు 48 స “లు
కులం: ముస్లిం, వృత్తి: గృహిణి ,
R/o :caltex బెల్లంపల్లి.

స్వాధీనం చేసుకున్న *వస్తువుల వివరాలు

1) 405 గ్రాముల గాంజా విలువ 20,250 /
2) రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ No: టిఎస్ 19 బి 1076
3) రెండు సెల్ ఫోన్లు.

వివరాల్లోకి వెళితే:

తాళ్ల గురజాల ఎస్సై శ్రీ రామకృష్ణ గారు తమ పోలీస్ సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పైన తెలిపిన A1, A2 లు అనుమానాస్పదంగా కనిపించగా వారి వద్ద ఉన్న బైకును పరిశీలించగా సుమారుగా 405 గ్రాముల గాంజా లభ్యం కావడంతో పంచనామా నిర్వహించి వీరిని అదుపులోకి తీసుకొని విచారించగ, A1) తల్లి అయినా A3) sk. ఫారజానా గత కొంత కాలంగా A1, A2 లకు మహారాష్ట్ర లోని చంద్రాపూర్ కు పంపి అక్కడ ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర గాంజా కొని తీసుకురమ్మని చెబుతూ ఉండేది.

అదే క్రమంలో నిన్నటి రోజున తేదీ 16.4.26 నా కూడా A1, A2 లకు డబ్బులు ఇచ్చి గాంజా కొని తీసుకో రమ్మని పంపగా వీరిద్దరూ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, బైక్ నెంబర్ : TS 19 B 1076 అనే బైక్ పైన వెళ్లి అక్కడ గుర్తుతెలవని వ్యక్తుల దగ్గర సుమారు 405 గ్రాముల గాంజా కొనుక్కొని వస్తున్న క్రమంలో బెల్లంపల్లిలోని పంచముఖ హనుమాన్ టెంపుల్ వద్ద చేరుకోగా అక్కడ పోలీసు వాళ్ళు పట్టుకొని విచారించి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి ఈరోజు A1 ని జ్యూడిషియల్ కస్టడీకి పంపడమైనది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News