- సిట్ నోటీసులతో కెసిఆర్ ను తక్కువ చేయలేరు.
- రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి వారి కంటే మించిన వారు కారు.
- మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి..
మోసపూరిత కాంగ్రెస్ పార్టీ బాకీపడ్డ హామీలపై ప్రజల దృష్టి మళ్లించేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఎన్నికలు ఏవి ఎప్పుడు వచ్చినా పెండింగ్ లో ఉన్న అంశాన్ని ఏ సందర్భంలో అయినా సమయానుకూలంగా వారి వ్యక్తిగత అవసరాల కోసం ముందేసుకుంటారని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ పై తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు కు 160 పిఆర్సి పై నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
గురువారం తన నివాసంలో మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ స్వామి గౌడ్ తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు లాంటి ప్రజ్ఞా పాటవాలు కలిగినటువంటి వారని.. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి తో సహా వారిని మించిన వారు కారని ఎద్దేవ చేశారు. భూగోళంలో ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో అన్ని రకాల ప్రయత్నాలు తెలంగాణ ఉద్యమాన్ని అణచాలని, ఆపాలని, నిరోధించాలని తెలంగాణ రాకుండా చేయాలని రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు చేయని ప్రయత్నం లేదని గుర్తు చేశారు.
అటువంటి ప్రతిబంధకాలను, ప్రలోభాలను వత్తి లను తట్టుకొని కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించారని కుండ బద్దలు కొట్టారు. మీకు అందనంత ఎత్తులో కేసీఆర్ ఉన్నాడని మీరు పెట్టే లొట్టా పీసు కేసుల కు ఇచ్చే నోటీసులు కేసీఆర్ ను ఏమి చేయలేవని ఘాటుగా స్పందించారు. కక్ష సాధింపు సాధిస్తామని స్వార్థ ప్రయోజనాల కోసం కెసిఆర్ పై ఆరోపణలు చేయడం మీ లేకితనం అవుతుందని హితవు పలికారు.
సిట్ కాంగ్రెస్ పార్టీ కి సంస్థగా మారిందని.. పోలీసులు అధికార పార్టీ ఏది చెబితే అమలు చేయడం వల్ల ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి మంచిది కాదని సూచించారు. అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు పలుస రమేష్ గౌడ్, సీనియర్ నాయకులు బి లక్ష్మయ్య, గంధం బాల పీరు తదితరులు పాల్గొన్నారు.
