Thursday, February 12, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంPermission Misuse | రెసిడెన్షియల్ భవనంలో ఆసుపత్రి

Permission Misuse | రెసిడెన్షియల్ భవనంలో ఆసుపత్రి

అనుమతి రెసిడెన్షియల్, కట్టింది కమర్షియల్
పట్టించుకోని మంచిర్యాల కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్
మంచిర్యాల మునిసిపల్ కమిషనర్ ఏం చేస్తున్నట్టు?
స్టిల్ట్ పార్కింగ్ అనుమతి తీసుకొని సెల్లార్ నిర్మాణం !

మంచిర్యాల నవంబర్ 24 (ఆదాబ్ హైదరాబాద్): మంచిర్యాల జిల్లా(Manchryala District)లో రెసిడెన్షియల్ అనుమతి(Residential Permission)తో నిర్మించిన బహుళ అంతస్తుల భవనం(Multi-storied building)లో కమర్షియల్ కార్యకలాపాలు (Commercial Activities) జరుగుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ నియమాల ప్రకారం ఏదైనా కమర్షియల్ భవనం నిర్మించాలంటే మునిసిపల్ కార్యాలయం నుండి సరైన అనుమతులు తీసుకోవడం, సంబంధిత ఫీజులను చెల్లించడం తప్పనిసరి. అయితే మంచిర్యాల బర్త్ రూట్ (శృతి గోలి) హాస్పిటల్స్ (Birthroots Hospital) నిర్వహణ మాత్రం ఈ నిబంధనలను పక్కన పెట్టి ప్రభుత్వ చట్టాలు మాకు వర్తించవు అన్నట్టుగా వ్యవహరిస్తూ రెసిడెన్షియల్ అనుమతితో నిర్మించిన భవనాన్ని కమర్షియల్ ఉపయోగాలకు అనగా ఆసుపత్రి నిర్వహణకు ఉపయోగిస్తున్నారు.

- Advertisement -

వివరాల్లోకి వెళితే..

మంచిర్యాల పట్టణంతోపాటు మంచిర్యాల జిల్లా, చుట్టుపక్కల ప్రాంతాల్లో శృతి గోలి బర్త్ రూట్ మెటర్నిటీ ఆసుపత్రి ఫేమస్. ఆస్పత్రి అనేది కమర్షియల్. వ్యాపార పరిధిలోకి వస్తుంది. కమర్షియల్ నిర్మాణం చేయాలంటే సంబంధిత మునిసిపాలిటీ నుంచి కమర్షియల్ బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని నిర్మాణం చేయాలి. కానీ ఇక్కడ పరిస్థితి విరుద్ధంగా ఉంది. ఈ హాస్పిటల్ బిల్డింగ్ యాజమాని మంచిర్యాల మునిసిపాలిటీ నుంచి 2019లో స్టిల్ట్, రెసిడెన్షియల్ భవన నిర్మాణం కోసం జి+5 అనుమతి తీసుకోగా అనుమతులకు విరుద్ధంగా సెల్లార్ నిర్మాణం చేపట్టడమే కాకుండా ఈ బిల్డింగ్‌లో ఆసుపత్రి నిర్వహిస్తున్నారు.

కళ్లు మూసుకున్న టౌన్ ప్లానింగ్ విభాగం

రెసిడెన్షియల్ భవనం కమర్షియల్‌గా మారినప్పుడు, మునిసిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం టీపీబీఓ, టీపీఎస్ అధికారులు తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించాలి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగితే ఉన్నతాధికారులకు నివేదించాలి. కానీ.. ఈ బిల్డింగ్ విషయంలో టౌన్ ప్లానింగ్ విభాగంలోని అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.

బిల్డింగ్ వైపు కన్నెత్తి చూడని కమిషనర్

రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్ వ్యాపారాలకు ఉపయోగిస్తున్నారు. ఇది ఆరు నెలలుగా జరుగుతున్నా ఆ బిల్డింగ్ వైపు మంచిర్యాల మునిసిపల్ కమిషనర్ చర్యలు తీసుకోకపోగా, ఆ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీంతో.. పలు అనుమానాలకు దారితీస్తోంది. మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయమై మున్సిపల్ కార్పొరేషన్‌ని ఆదాబ్ హైదరాబాద్ వివరణ కోరగా మునిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News