- వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ ఐపీఎస్.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో ఈనెల 5 నుండి జరిగే ఉర్సు ఉత్సవాల సందర్భంగా వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ ఐపీఎస్, మామునూరు ఏసిపి ఎన్. వెంకటేష్, పర్వతగిరి సి.ఐ బి. రాజగోపాల్ అన్నారం షరీఫ్ దర్గాను సోమవారం సందేశ్శించినారు. ఈ సందర్భంగా ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో దర్గా ఉత్సవాలు నిర్వహించుకోవాలని భక్తులకు డిసిపి సూచించారు. అలాగే దర్గా బందోబస్తు గురించి సిబ్బందికి తగు సూచనలు తెలియజేసారు. అనంతరం దర్గాను సందర్శించి, యాకూబ్ షావలికి సిబ్బందితో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు.


- Advertisement -
