బస్సు ప్రమాదంలో 22 మందికి స్వల్ప గాయాలు
ఏపీలోని కర్నూల్ (Kurnool) జిల్లాలో ఘోర ప్రమాదం (Bus Accident) జరిగింది. వేమూరి కావేరీ ట్రావెల్స్ (Vemuri Cauvery Travels) బస్సులో మంటలు చెలరేగి 19 మంది సజీవ దహనమయ్యారు(Burned alive). మరో 22 మందికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతుండగా తెల్లవారుజామున జాతీయ రహదారి (National Highway) 44పై కర్నూలు శివారు చిన్నటేకూరులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఫైర్ యాక్సిడెంట్ (Fire Accident) జరిగిన సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు (Passengers), ఇద్దరు డ్రైవర్లు మొత్తం 43 మంది ఉన్నారు.

ఒక డ్రైవర్ పరారీలో ఉండగా మరో డ్రైవర్‌ను పోలీసులు పట్టుకున్నారు. బస్సు బైక్‌ను ఢీకొట్టడం(Bike-bus collision)తో ప్రమాదం సంభవించింది. బైక్ బస్సు కిందికి వెళ్లగా ఆ టైమ్‌లో బైక్‌లోని పెట్రోల్ లీక్ కావటమే దుర్ఘటనకు కారణమని చెబుతున్నారు. బస్సు నంబర్ DD 01 AN 9190. బస్సులో రిజర్వేషన్ చేయించుకున్నవారి వివరాలు ఈ కింది ఫొటోల్లో చూడొచ్చు.



