- చీదురు శంకర్, వార్డు సభ్యులు.
- ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు.
పర్వతగిరి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ చీదురు శంకర్, ఉప సర్పంచ్ చింతకుంట్ల అనిత తో పాటు, 13మంది వార్డు సభ్యులచే స్థానిక ఎంపీడీఓ మాలోత్ శంకర్ నాయక్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు ఘన స్వాగతం పలికారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వార్డు సభ్యులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శంకర్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో గెలిపించిన ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా స్థానిక ఎమ్మెల్యే, స్థానిక కాంగ్రెస్ నాయకుల సహకారంతో నెరవేరుస్తానని తెలిపారు.

ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని ఆ ప్రజా పాలనను పర్వతగిరి గ్రామంలో అమలు చేసే బాధ్యత స్థానిక సర్పంచ్ పై ఉందని, మండల అధికారులతో, మండల నాయకులతో కలిసి ప్రజల సమస్యలను తీరుస్తూ మంచి పరిపాలన కొనసాగించాలని సూచించారు. గ్రామ ప్రత్యేక అధికారిగా విధులు చేపట్టిన స్థానిక ఎంపీడీవో మాలోత్ శంకర్ నాయక్ ను, ఎంపీఓ శేషును ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, యువతీ యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలు గ్రామాల నూతన సర్పంచులు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

