పాకిస్థాన్ మాజీ ప్రధాని (Pakistan Former PM) ఇమ్రాన్‌ఖాన్‌కి(Imran Khan), ఆయన భార్య(His Wife)కు మరో కేసులో శిక్ష పడింది. అక్రమాస్తులకు (Graft) సంబంధించిన కేసులో వీళ్లిద్దరికి శనివారం 17 ఏళ్ల శిక్ష విధించారు. ఇమ్రాన్‌ఖాన్ పదవిలో ఉన్నప్పుడు సౌదీ అరేబియా ప్రభుత్వం (Saudi Arabia) నుంచి వచ్చిన నగలు సహా బహుమతులను వాటి మార్కెట్ వ్యాల్యూ కన్నా చాలా తక్కువ ధరకు అమ్మారని వారిపై ఆరోపణలు వచ్చాయి. గవర్నమెంట్ గిఫ్టుల(Government Gifts)ను తమ వద్ద ఉంచుకున్నందుకు, విక్రయించినందుకు ఇమ్రాన్‌ఖాన్ దంపతులు దోషులుగా తేలారని అధికారులు, ఆయన పార్టీ ప్రతినిధులు తెలిపారు.
తాము ఎలాంటి నేరమూ చేయలేదని నిందితులు పేర్కొనగా.. వాళ్లు అధికారికంగా ప్రకటించని బహుమతులను తిరిగి అమ్మడం ద్వారా డబ్బు సంపాదించారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. పాకిస్తాన్ చట్టం ప్రకారం.. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు విదేశీ ప్రముఖుల నుంచి పొందిన బహుమతులను తమ వద్ద ఉంచుకోవాలంటే అంచనా వేసిన మార్కెట్ విలువకు వాటిని కొనాలి. ఒకవేళ వాటిని అమ్మితే తద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రకటించాలి.
