- నిర్వహించిన పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు అనుమల్ల చంద్రమౌళి
- స్వతంత్ర అభ్యర్థి వేముల చంద్రశేఖర్ కవిత గెలుపు పై ధీమా
కరీంనగర్ నగరపాలక సంస్థలోని 17వ డివిజన్లో పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు అను మల్ల చంద్రమౌళి స్వతంత్ర అభ్యర్థి వేముల కవిత చంద్రశేఖర్ కు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు అను మల్ల చంద్రమౌళి మాట్లాడుతూ అభివృద్ధి అంటే వేముల చంద్రశేఖర్ కవిత అని అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పనిచేసే నాయకులు అని వీరికి పట్టం ప్రజలు కట్టాలని గెలిపించాలని పేరుపేరునా కోరుతూ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రజల మనిషిగా ఎన్నో రకాల సేవలు నిరంతరం వేముల కవితా చంద్రశేఖర్ చేస్తున్నారని వారిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు పద్మశాలి సంఘం నేతలు పాల్గొన్నారు.
- Advertisement -
