Tuesday, February 10, 2026
Homeహైదరాబాద్‌Celebration | అడ్డగుట్ట బిఆర్ఎస్ నేత నక్క మధు జన్మదిన వేడుకలు

Celebration | అడ్డగుట్ట బిఆర్ఎస్ నేత నక్క మధు జన్మదిన వేడుకలు

  • శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపిన సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నక్క మధు జన్మదిన వేడుకలు సోమవారం అడ్డగుట్టలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సికింద్రాబాద్ శాసనసభ్యులు,మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ నక్క మధుకు శాలువా కప్పి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అడ్డగుట్ట కార్పొరేటర్ భర్త,నగర గ్రంథాలయం మాజీ డైరెక్టర్ లింగాన్ని శ్రీనివాస్ కూడా పాల్గొని నక్క మధుకు శుభాకాంక్షలు తెలిపారు.

పార్టీ శ్రేణులు,అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై జన్మదిన వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ మాట్లాడుతూ,నక్క మధు అందరితో స్నేహపూర్వకంగా మెలుగుతూ,సమన్వయంతో పనిచేసే నాయకుడిగా గుర్తింపు పొందారని కొనియాడారు.వ్యక్తిగతంగా,పార్టీ పరంగా కూడా కలిసి జన్మదినాన్ని జరుపుకోవడం శుభపరిణామమని ఆయన అన్నారు.

- Advertisement -

భవిష్యత్తులో ప్రజాసేవ పట్ల మరింత రెట్టింపు ఉత్సాహంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ,ప్రజాదరణను మరింత పెంచుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని నక్క మధుకు ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News