Saturday, February 21, 2026
Homeహైదరాబాద్‌Honour | డాక్టరేట్ అందుకున్న కిన్నెర మొగులయ్యకు సన్మానం

Honour | డాక్టరేట్ అందుకున్న కిన్నెర మొగులయ్యకు సన్మానం

  • అరుదైన కళాకారుడికి అభినందనలు : వనస్థలిపురం ఇన్​స్పెక్టర్​ మహేశ్​

‘తెలంగాణ సంస్కృతిలో అరుదైన కళగా పేరొందిన 12 మెట్ల కిన్నెర గానాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప కళాకారుడు పద్మశ్రీ దర్శనం మొగులయ్య’ అని వనస్థలిపురం పోలీస్​ ఇన్​స్పెక్టర్​ టి. మహేశ్​ అన్నారు. అంతరించి పోతున్న కళను తన ప్రదర్శనల ద్వారా వెలుగులోకి తెచ్చిన మొగులయ్యకు ఇటీవల చెన్నైలోని ‘గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ’ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.

ఈ నేపథ్యంలో శుక్రవారం వనస్థలిపురం పీఎస్​కు వచ్చి ఇన్​స్పెక్టర్​ మహేశ్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఐ మొగులయ్యను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. కళారంగంలో వారి కృషి రాష్ట్రానికి , దేశానికి గౌరవాన్ని తీసుకువచ్చిందని ఇన్​స్పెక్టర్​ టి. మహేశ్​ ప్రశంసించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News