- పద్మారావు గౌడ్
- సీతాఫల్మండిలో 97 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం
సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఎనిమిది మున్సిపల్ వార్డులను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని,తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లు కూడా అభివృద్ధి పనుల్లో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నారని సికింద్రాబాద్ శాసనసభ్యులు,మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ తెలిపారు.గురువారం సీతాఫలమండీ మున్సిపల్ డివిజన్ పరిధిలో ఆయన విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా రూ.97 లక్షల వ్యయంతో వివిధ బస్తీలు, కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ సికింద్రాబాద్‌ను సమస్యల రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దడం తమ లక్ష్యమని తెలిపారు.గత 50 సంవత్సరాల్లో చేపట్టని అనేక అభివృద్ధి పనులను గత పదేళ్లలో పూర్తి చేశామని పేర్కొన్నారు.బ్యాంక్ కాలనీ,సీతారామనగర్,మేడి బావి,రామాలయం,బీదల బస్తీ,టీ.ఆర్.టి క్వార్టర్స్ తదితర ప్రాంతాల్లో పద్మారావు గౌడ్ పాదయాత్ర నిర్వహించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సామల హేమతో పాటు అధికారులు సువర్ణలత,మాధవి,విద్యాసాగర్,వేణు,కుశల్,శ్రీకాంత్,వర్క్ ఇన్స్పెక్టర్ రాజు,యువ నేత రామేశ్వర గౌడ్,సమన్వయకర్త రాజా సుందర్,పార్టీ నాయకులు,అధికారులు పాల్గొన్నారు.
