- చిలకలగూడా కబరాస్తాన్లో ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పరిశీలన
సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఈద్గా,కబరాస్తాన్లను వివిధ సదుపాయాలతో అభివృద్ధి చేశామని సికింద్రాబాద్ శాసనసభ్యులు,మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ తెలిపారు.గురువారం చిలకలగూడా కబరాస్తాన్ను ఆయన సందర్శించి,రానున్న రోజుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.ప్రతి సంవత్సరం వివిధ పర్వదినాల సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే నేపథ్యంలో అవసరమైన మౌలిక సదుపాయాలు,ఏర్పాట్లు పకడ్బందీగా కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సామల హేమ,జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు మాధవి,వేణు,వర్క్ ఇన్స్పెక్టర్ రాజు,శ్రీనివాస్,మైనారిటీ నేతలు జహాంగీర్ భాయి,ఘౌస్,కాలీమ్ చిచ్చా,మున్నా భాయి,సమన్వయకర్త రాజా సుందర్ తదితరులు పాల్గొన్నారు.
