Monday, February 16, 2026
Homeహైదరాబాద్‌Felicitations | డాక్టరేట్లు పొందిన వారికి సన్మానం

Felicitations | డాక్టరేట్లు పొందిన వారికి సన్మానం

  • ఎమ్మెల్యే పద్మారావు గౌడ్

మహాత్మా గాంధేయవాద సిద్దాంతాన్ని ప్రోత్సహించే వారికి గౌరవ డాక్టరే ట్లు అందించే ప్రముఖ అమెరికన్ సంస్థ ‘మహాత్మా గాంధీ గ్లోబల్ పీస్ ఫౌండేషన్ (ఎం.జీ.జీ.పీ)’ద్వారా గౌరవ డాక్టరేట్లు సాధించిన డాక్టర్ గుడిదేవిని ప్రభాకర్ గౌడ్, డాక్టర్ సయ్యద్ ఉస్మాన్ అజార్,డాక్టర్ యడ్ల మధుకర్ లను సికింద్రాబాద్ శాసనసభ్యులు,మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ ఘనంగా సత్కరించారు.ఆదివారం మోండా మార్కెట్ లోని తన నివాసంలో వారిని సత్కరించి డాక్టరేట్ సర్టిఫికేట్ లను అందించారు.

ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ మానవతా విలువల పరిరక్షణ, గాంధేయ వాద సిద్దాంతల రక్షణ కు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సి ఉందని అన్నారు.శాంతి,మానవత్వం యొక్క తత్వ శాస్త్రం ఆధారంగా గౌరవ డాక్టరేట్లు అందించడం ప్రశంసనీయమని అన్నారు.డాక్టరేట్లు పొందిన డాక్టర్ గుడిదేవిని ప్రభాకర్ గౌడ్, డాక్టర్ సయ్యద్ ఉస్మాన్ అజార్,డాక్టర్ యడ్ల మధుకర్ లను పద్మారావు గౌడ్ అభినందించారు.ఏం.జీ.జీ.పీ. ప్రతినిధులు డాక్టర్ మైక్ లిట్‌మాన్,USA (గ్లోబల్ డైరెక్టర్)డా.హృషికేస్ ఆచార్య (ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్),డాక్టర్ సుప్రజా శ్రీనివాస్ ల పక్షాన ప్రతినిధిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News