Wednesday, March 25, 2026
HomeతెలంగాణOverseas Scholarship | బకాయిల విడుదల

Overseas Scholarship | బకాయిల విడుదల

వివరాలు వెల్లడించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

గత ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షిష్టంగా ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని నిధులు విడుదల చేశామని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ (Sc, St, Bc, Minority) వర్గాల విద్యార్థులందరికీ విద్య ద్వారా సమాన అవకాశాలు, వారి ఉజ్వల భవిష్యత్ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఒక్కో విద్యార్థికి ఓవర్సీస్ నిధులు రూ.20 లక్షల చొప్పున సుమారు రూ.304 కోట్ల నిధులు విడుదల చేశామని వెల్లడించారు. ఇప్పటివరకు 3642 మంది విద్యార్థులకు రూ.463 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు.

- Advertisement -

ఆయన ఇంకా ఏమన్నారంటే.. 2022 నుంచి ఈ రోజు వరకు ఉన్న బకాయిల(Arrears)ను విడుదల చేశాం. అర్హత కలిగిన విద్యార్థులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమవుతుంది. విదేశాల్లో ఉన్నత విద్యను కొనసాగిస్తున్న మన తెలంగాణ విద్యార్థులు (Telangana Students) పడుతున్న ఆర్థిక ఇబ్బందులను గమనించి ఓవర్సీస్ స్కాలర్‌షిప్ నిధులను విడుదల చేయడం జరిగింది. ఈ నిధుల విడుదల ద్వారా విద్యార్థుల కలలను నేరవేర్చడంతో పాటు వారి కుటుంబాల్లో వెలుగులు నింపింది. విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదనను మా ప్రభుత్వం అర్థంచేసుకుంది. యూకే, అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా(UK, America, Europe, Australia)తోపాటు పలు దేశాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు మా ప్రభుత్వం ఊరట కల్పించింది.

ప్రస్తుతం విదేశాల్లో అననుకూల పరిస్థితుల కారణంగా మన రాష్ట్ర విద్యార్థులు పడుతున్న ఇబ్బందులకు ఈ నిధుల ద్వారా వారికి ఉపశమనం లభిస్తుంది. సంక్షేమ హాస్టల్స్ లో (ఎస్సీ ఎస్టీ బీసీ, మైనార్టీ) హాస్టల్స్ తక్షణ ఇబ్బందులను అధిగమించేందుకు రూ. 60 కోట్లు విడుదల చేశాం. ఇవి జిల్లా కలెక్టర్లు, సెక్రటరీ పరిధిలో ఉంచాం. సీఎం సహాయ నిధి నుంచి సంక్షేమ హాస్టల్ పిల్లలకు నిదులు అందించాం. 119 నియోజకర్గాల్లో సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్ తోని యంగ్ ఇంటి గ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. సంక్షేమ హాస్టల్లో ఏ సమస్య ఉన్న తక్షణ పరిష్కారం కోసం నిధులు మంజూరు చేశాం.

గత 10 ఏళ్లు పరిపాలించిన వారు సంక్షేమ హాస్టల్స్ పిల్లల డైట్ కోసం ఆలోచన చేయలేదు. మా సీఎం, డిప్యూటీ సీఎం చొరవతో డైట్ ఛార్జీలు పెంచాం. మా అధికారులందరూ సంక్షేమ పాఠశాలలు, హాస్టల్స్ విద్యార్థులకు ఏ సమస్య ఉన్న తక్షణం పరిష్కారం కోసం నిరంతరం పని చేస్తున్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి అర్హత ఉన్నవారికే ఇస్తాం. అనర్హులకు ఇవ్వం. ఈ నిధుల విడుదలకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు. ఈ సమావేశంలో వెల్ఫేర్ spl CS సభ్యసాచి గోష్, ఎస్సిడిడి Prl Secy సెక్రటరీ బుద్ధ ప్రకాష్, కమిషనర్ క్షితిజ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News