Sunday, October 5, 2025
ePaper
Homeతెలంగాణఉప్పొంగుతున్న డ్రైనేజీ వాట‌ర్‌

ఉప్పొంగుతున్న డ్రైనేజీ వాట‌ర్‌

  • నెల రోజులుగా రోడ్డుపై మురుగునీరు పారుతున్న
  • ఎవరూ పట్టించుకోవడం లేదు : వాహనదారులు

నిత్యం వేలాది మంది తిరుగుతున్న రోడ్‌ పై గత నెల రోజులుగా నడిరోడ్డుపై డ్రైనేజ్‌ నీళ్లు పొంగిపొర్లుతున్న ఏ ఒక్క ప్రజాప్రతినిధి గాని అధికారిలు గాని పట్టించుకున్న పాపాన పోలేదు. వివరాల్లోకి వెళ్తే మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్‌ నగర్‌ డివిజన్‌ పరిధిలోని గౌతమ్‌ నగర్‌ రోడ్‌ నెంబర్‌ 1లో దుర్గ భవాని ఆలయం పక్కన, నిత్యం వేలాదిమంది సంచరించే రోడ్‌ లో గత నెల రోజులుగా నడి రోడ్డు పైన మురుగునీరు పొంగిపొర్లి, చిన్న చెరువుగా మారి ఆ ప్రాంత మంతా దుర్వాసనతో వ్యాపిస్తుంది. నిత్యం అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు ఈ రోడ్డు వెంట వెళ్తున్న, సదరు సమస్యను మాత్రం పరిష్కరించడానికి ఏ ఒక్కరు కృషి చేయకపోవడం విడ్డూరం. గుడికి వచ్చే పాదచారులు, స్కూల్‌ కి కాలేజీకి వెళ్లే విద్యార్థులు ఆ మురుగు నీళ్లలో నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. పక్కనే రైల్వే గేట్‌ ఉండడం, రైల్వే గేటు పడ్డప్పుడల్లా ఈ మురుగుకుంట లో నుండి వచ్చే దుర్వాసన తో, వాహనదారులు ఇబ్బందులకు గురి అవుతున్నామని వాపోతున్నారు. తక్షణమే సంబంధిత‌ అధికారులు స్పందించి రోడ్డుపై పారుతున్న మురుగు నీటి సమస్యలు తీర్చాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News