Wednesday, February 11, 2026
Homeహైదరాబాద్‌OU | ఘనంగా ముగిసిన కేంద్ర-రాష్ట్ర సంబంధాల జాతీయ సదస్సు

OU | ఘనంగా ముగిసిన కేంద్ర-రాష్ట్ర సంబంధాల జాతీయ సదస్సు

ఉస్మానియా విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల జాతీయ సదస్సు ఘనంగా ముగిసింది.సమకాలీన భారతదేశంలో కేంద్ర–రాష్ట్ర సంబంధాల పునఃఆవిష్కరణ అంశంపై జరిగిన ఈ సదస్సులో నియోజకవర్గాల పునర్విభజన,ఆర్థిక సమాఖ్యవాదం,ఒకే దేశం–ఒకే ఎన్నిక,డిజిటల్ గవర్నెన్స్ వంటి అంశాలపై లోతైన చర్చలు జరిగాయి.ముగింపు కార్యక్రమానికి మణిపూర్ యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ తిరుపతి రావు ముఖ్య అతిథిగా హాజరై కేంద్ర రాష్ట్ర సమన్వయం ప్రజాస్వామ్య బలోపేతానికి కీలకమని పేర్కొన్నారు.

హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ బిజు సమకాలీన సమాఖ్య రాజకీయాలపై విశ్లేషణాత్మక ప్రసంగం చేశారు.ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం కార్యక్రమాన్ని అభినందించారు.దేశవ్యాప్తంగా పాల్గొన్న పరిశోధకులు,అధ్యాపకులకు సర్టిఫికేట్లు అందజేశారు.సదస్సు ద్వారా సమాఖ్య వ్యవస్థ బలోపేతానికి పలు సూచనలు వెలువడినట్లు నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News