Homeఆదిలాబాద్Examinations | ఓపెన్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Examinations | ఓపెన్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

  • జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు.

జిల్లాలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా స్థానిక సంస్థల ప్రధాన కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు.ఓపెన్ పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు బుధవారం, తన ఛాంబర్ లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

Open SSC and Intermediate exams strict conduct guidelines district officials

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈనెల 20వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్న 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు రెండు పూటలా పరీక్షలు నిర్వహించాలన్నారు. జిల్లాలో 1035 మంది పదవ తరగతి, 821 ఇంటర్, మొత్తం కలిపి 1856 మంది విద్యార్థులు, 5 ఎస్ ఎస్ సి, 4 ఇంటర్, మొత్తం 9 పరీక్ష కేంద్రాలలో ఓపెన్ పరీక్షలు రాయనున్నట్లు వివరించారు. అన్ని పరీక్ష కేంద్రాలలో విద్యార్థులు సౌకర్యవంతంగా పరీక్షలు రాసేలా తగిన ఫర్నిచర్, తాగునీరు, నిరంతరాయ విద్యుత్ సరఫరా, తదితర వసతులు ఉండాలన్నారు.

- Advertisement -
Open SSC and Intermediate exams strict conduct guidelines district officials2

తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బందితో కూడిన అత్యవసర వైద్య శిబిరం ఏర్పాటు చేసి అవసరమైన అత్యవసర మందులు, ఓఆర్ఎస్ పొట్లాలు అందుబాటులో ఉంచాలన్నారు. దూర ప్రాంత విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా అవసరమైకు ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. ఈ సమావేశంలో డిఈఓ భోజన్న, డిఐఈఓ పరుశురాం, తపాలా శాఖ ఇన్స్ పెక్టర్, ఎసిజిఈ పరమేశ్వర్, ఆర్టీసీ, వైద్య శాఖల అధికారులు రమేష్, సౌమ్య, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News