Friday, March 6, 2026
Homeరంగారెడ్డిNegligence | కీసర సర్కిల్ కార్యాలయంలో అందుబాటులో ఉండని అధికారులు

Negligence | కీసర సర్కిల్ కార్యాలయంలో అందుబాటులో ఉండని అధికారులు

కీసర సర్కిల్ కార్యాలయంలో అధికారులు అందుబాటులో ఉండడం లేదు. తమకు ఇష్టం వచ్చినట్లుగా విధులకు హాజరవుతున్నారు. డిప్యూటీ కమిషనర్ వారానికి ఒకసారి ప్రజావాణి కార్యక్రమంలో మినహా మళ్ళీ కనబడరు. డీఈ, టీపీవో, టీపీఎస్‌లు వారానికి ఒకసారి కార్యాలయానికి రావడం కూడా గగనమే. పేరుకే కీసర సర్కిల్ కార్యాలయంగా ఉంది కానీ అధికారులు ఎవరూ కార్యాలయంలో అందుబాటులో ఉండడం లేదు.

దీంతో ప్రజలు తమ సమస్యలను అధికారులను కలిసి విన్నవించుకోలేకపోతున్నారు. మిగతా కార్యాలయ సిబ్బంది కూడా ఉదయం 11 గంటలు దాటినా ఆఫీసుకు రావడం లేదు. కీసర సర్కిల్‌లో డ్రైనేజీ, అంతర్గత రోడ్ల సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుందన్‌పల్లి రామలింగేశ్వర కాలనీలో భూగర్భ మురుగు నీటి కాల్వలు లేకపోవడంతో మురుగు ఇండ్ల మధ్యలో ప్రవహిస్తూ ఉంటుంది.

- Advertisement -

చీర్యాల్ డబల్ బెడ్ రూం వాసులు డ్రైనేజీ, అంతర్గత రోడ్లు లాంటి మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కీసరలోని నందినీ నగర్ ఏర్పడి మూడు దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ అంతర్గత రోడ్లు సరిగా లేవు. ఇప్పటికైనా అధికారులు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై దృష్టి సాధించాలని కీసర సర్కిల్ వాసులు కోరుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News