Friday, March 6, 2026
Homeఆంధ్రప్రదేశ్Rains | అధికారులూ.. బీ అలర్ట్..

Rains | అధికారులూ.. బీ అలర్ట్..

హోం మంత్రి అనిత ఆదేశం

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం రానున్న 12 గంటల్లో వాయుగుండంగా బలపడనుండటంతో ప్రభుత్వ యంత్రాంగం హైఅలెర్ట్‌(High Alert)గా ఉండాలని హోం మంత్రి అనిత ( Home Minister Anitha) ఆదేశించారు. వాయుగుండం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతూ తదుపరి 12 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో అతిభారీ వర్షాలు (Heavy Rains) పడనున్నాయి.

- Advertisement -

ఈ నేపథ్యంలో అనిత విపత్తుల నిర్వహణ సంస్థ (Disaster Management Authority) అధికారులతో సమీక్షించారు. ‘బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అత్యవసరమైతే (Emergency) తప్ప ప్రయాణాలు చేయొద్దు. సహయక చర్యలకు NDRF, SDRF, పోలీస్, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలి’ అని చెప్పారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ (Control Rooms) ఏర్పాటుచేసి 24/7 అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని చెప్పారు. వాతావరణ పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలు పంపాలని సూచించారు. సహాయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ (Toll Free) నంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలని పేర్కొన్నారు. ప్రజలు సురక్షిత భవనాల్లో ఉండాలని హోం మంత్రి అనిత కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News