టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఇండియా(India)లో జరిగే మ్యాచ్‌ల్లో పాల్గొనటమా? మానేయటమా? అనేది ఇక తేల్చుకోవాల్సింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డే(Bangladesh Cricket Board) అనే వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ కోరినట్లుగా మ్యాచ్ వేదిక(Match Venue)లను ఇండియా నుంచి శ్రీలంక(Srilanka)కు మార్చటం ప్రస్తుత పరిస్థితుల్లో కుదరదని ఐసీసీ స్పష్టం(ICC Clarity) చేసినట్లు తెలుస్తోంది. వేదికలను వేరే దేశానికి మార్చటానికి ఎక్కువ సమయం లేకపోవటంతో ఐసీసీ.. బీసీబీకి క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ఒకవేళ బంగ్లాదేశ్ ఆడకపోతే ఆ జట్టు ప్లేసులో స్కాట్‌లాండ్ టీమ్(Scotland Team)కి ఛాన్స్ ఇవ్వాలని ఐసీసీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భారత్‌లో మ్యాచ్‌లు ఆడితే భద్రతపరంగా బంగ్లాదేశ్ టీమ్‌కి ముప్పూ ఉండదని స్వయంగా ఐసీసీ హామీ ఇచ్చినట్లు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో పేర్కొంది. ఆడాలా వద్దా అనేది తేల్చుకోవటానికి ఐసీసీ.. బీసీబీకి ఈ నెల 21 వరకు సమయం ఇచ్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు వర్గాల మధ్య రెండు సార్లు సమావేశం జరిగింది. షెడ్యూల్‌ను మార్చేందుకు సుముఖంగా లేని ఐసీసీ.. బాల్‌ని బీసీబీ కోర్టులోకే వేసింది.
T20 World Cup | ఇక తేల్చుకోవాల్సింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డే
By Aadab Desk
- Advertisement -
Previous article
