Wednesday, February 18, 2026
Homeక్రైమ్ వార్తలుElevator | ఎక్కువవుతున్న లిఫ్ట్ ప్రమాదాలు..

Elevator | ఎక్కువవుతున్న లిఫ్ట్ ప్రమాదాలు..

  • నోయిడాలో మహిళకు గాయాలు..
  • ఆందోళన వ్యక్తం చేసున్న స్థానికులు..

గ్రేటర్ నోయిడా పరిధిలో ఇటీవల లిఫ్ట్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఎత్తైన భవంతులున్నాయి. ప్రతి బిల్డింగులో లిఫ్ట్‌లు మామూలే. అయితే, అవి తరచూ ప్రమాదానికి గురవుతున్నాయి. తాజాగా పశ్చిమ గ్రేటర్ నోయిడాలోని ఒక భవంతిలో లిఫ్ట్ 15వ ఫ్లోర్ నుంచి ఒక్కసారిగా కిందికి పడిపోయింది. 10వ ఫ్లోర్ వరకు వేగంగా వచ్చి ఆగిపోయింది. ఈ సమయంలో లిఫ్ట్‌లో ఉన్న మహిళకు తీవ్ర గాయలయ్యాయి.

లిఫ్ట్‌లో ఆమె బ్యాలెన్స్ తప్పి కిందపడటం, అక్కడి వాల్స్‌కు వేగంగా తగలడంతో తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన సూపర్ టెక్ ఎకో విలేజ్-1 పరిధిలోని జీ5 టవర్‌లో జరిగింది. ఘటన తర్వాత లిఫ్ట్ డోర్లు తెరుచుకోకపోవడంతో వాటిని నిర్వాహకులే తెరవాల్సి వచ్చింది. అనంతరం అందులోని మహిళను స్తానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆమె కాళ్లకు తీవ్ర గాయాలైనట్లు, మూడు చోట్ల విరిగినట్లు డాక్టర్లు తెలిపారు. బాధిత మహిళ టవర్ ఎఫ్‌7లో ఉంటారు.

- Advertisement -

అయితే, జీ5లో ఉన్న సన్నిహితుల్ని కలవడానికి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది. అయితే, లిఫ్ట్ పూర్తిగా కిందికి పడిపోకుండా 10వ ఫ్లోరులో ఆగడం వల్ల ఆమెకు మరింత ప్రమాదం తప్పిందని అక్కడి వారు అంటున్నారు. అయితే, తమ ప్రాంతంలో ఇలా వరుసగా లిఫ్ట్ ప్రమాదాలు జరగడంపై నోయడా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News