Thursday, February 12, 2026
Homeఆరోగ్యంEar Wax | గులిమి తీయాల్సిన పనిలేదు

Ear Wax | గులిమి తీయాల్సిన పనిలేదు

చెవిలోని గులిమి (Ear Wax) తీయాల్సిన పనిలేదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. గులిమి అనేది తనకుతానుగా బయటకు వస్తుంది. కాబట్టి మనం పనిగట్టుకొని ఇయర్ బడ్స్(Ear Buds), పిన్నీసులు, అగ్గిపిల్లలతో తీయొద్దు. అతికొద్ది (5 శాతం) మందికి మాత్రమే గులిమి చెవి లోపల ఉంటుంది. ఇందులోనూ 1 నుంచి 2 శాతం మందికే గులిమి గట్టిపడి చెవి మార్గం మూసుకుపోతుంది. అలాంటివాళ్లు ఈఎన్టీ డాక్టర్‌(ENT Doctor)తో గులిమి తీయించుకోవాలి. మనకు తోచినట్లు గులిమి తీయటానికి ప్రయత్నిస్తే కర్ణభేరికి రంధ్రం పడుతుంది. అలా జరిగితే హానికారకాలు చెవి లోపలికి వెళ్లి ఇన్‌ఫెక్షన్, నొప్పి, చీము వంటి వాటికి దారితీస్తాయి. చెవి మార్గం ముందుభాగంలో ఉండే వెంట్రుకలు, సెబేషియస్ గ్రంథుల నుంచి వెలువడే స్రావాల వల్ల గులిమి తయారవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News