- పెద్దమందడి చెరువుకు నీటిని అందించి తీరుతా.
- మాజీమంత్రి నిరంజన్ రెడ్డి..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేలైన ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని చేయలేదని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగత్ పల్లి, మనిగిల్ల, పెద్దమందడి, అల్వాల, మోజర్ల తదితర గ్రామాలలో బిఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపుకై విస్తృతంగా పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. పెద్దమందడి రైతాంగాన్ని ఆదుకోవాలని బుద్దారం బ్రాంచ్ కెనాల్ ద్వారా సాగు నీరు అందించామని కానీ నీటి సరఫరా సకాలములో అందడం లేదని అన్నారు.

బిఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి స్వాతిని గెలిపిస్తే శంకర సముద్రం నుండి ఎత్తిపోతల పథకం సాధించి రైతాంగ వేతలు తీరుస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం మాయమాటలు చెబుతు మాకు ఓటు వేయకపోతే అభివృద్ధి ఆగిపోతుందని బెదిరిస్తున్నారని, రెండేండ్లు ఏమి పీకలేనివారు ఇప్పుడు ఏమి అభివృద్ధి చేస్తారని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమములో గట్టు యాదవ్, జగదీశ్వర్ రెడ్డి, పలుస రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్, గంధం పరంజ్యోతి, బండారు కృష్ణ, ప్రేమ్ నాథ్ రెడ్డి, స్టార్ రహీమ్, గులాం ఖాదర్ ఖాన్, ఇమ్రాన్, అరీఫ్, మంద రాము, అనిపాటి రాము, అలీమ్ తదితరులు పాల్గొన్నారు.

