Wednesday, March 4, 2026
Homeమహబూబ్‌నగర్‌Constitution | డాక్టర్.అంబేద్కర్ రాజ్యాంగం ప్రపంచదేశాలకు స్పూర్తి.

Constitution | డాక్టర్.అంబేద్కర్ రాజ్యాంగం ప్రపంచదేశాలకు స్పూర్తి.

  • అంబేద్కర్ వల్లే చిన్న రాష్ట్రల ఏర్పాటు.
  • మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి..

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందని, అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే చిన్న రాష్ట్రాల ఏర్పాటు జరుగుతుందని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం భారత రాజ్యంగా నిర్మాత డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చౌక్ లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్ల చిన్న రాష్ట్రాల ఏర్పాటు జరిగిందని అందువల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యిందని అన్నారు.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ హరిజన, గిరిజన, బడుగు బలహీన ,మైనార్టీ వర్గాలకు పరిపాలనలో భాగస్వామ్యం కల్పించారని అంబేద్కర్ ఆశయాలను నేటి యువత స్పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నివాళులు అర్పించిన వారిలో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాజీ కౌన్సిలర్స్ పెండెం నాగన్న యాదవ్, కంచె రవి, నీలస్వామి, సంపత్ రెడ్డి, కరుణాకర్, ఎర్ర మన్యం, బషీర్, సత్యం తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News