- కింది సిబ్బంది ప్రవర్తనతో నిమ్స్ ఆసుపత్రిలో రోగులు బేజార్…
హైదరాబాద్ పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో శుక్రవారం సర్వర్ మోరాయించడంతో పలుచోట్ల ఆరోగ్యశ్రీ రోగులు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. ఉదయం 10 గంటల నుండి ఐదు గంటల వరకు కూడా సర్వర్ పనిచేయకపోవడంతో పేద ప్రజలు నిరాశతో వేనుతిరిగారు. దీనికి తోడు నిమ్స్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సిబ్బంది, నర్సులు, రోగులతో వ్యవహరిస్తున్న తీరు వర్ణనాయుతం. ఆరోగ్యశ్రీ తో వైద్యం తీసుకుంటున్నా రోగులను కొంతమంది నర్సులు రోగులను కుక్కలు, పనికిరాని వాళ్ళు, చావడానికి వస్తారా, ఇలాంటి మాటలతో రోగులను మానసిక వేదకు గురి చేస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు.
ఇంత జరుగుతున్న ఆరోగ్యశ్రీ బాధితులు దిక్కు లేక ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమాలన్నీ సహిస్తూ వైద్యం తీసుకుంటున్నారు. ఇంత జరుగుతున్న ఆసుపత్రి ఉన్నత అధికారులు కానీ, ప్రభుత్వంలో ఉన్న సంబంధించిన మంత్రి కానీ ఇటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు . మరి ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిమ్స్ ఆసుపత్రిలో పేద రోగులపై జరుగుతున్న అరాచకాలను అరికట్టాలని రోగుల తరఫున బంధువులు కోరుతున్నారు.
