- నవరస గార్డెన్ లో.. అక్రమార్కులు.. అధికారుల.. నాటకీయ చదరంగం
- రాష్ట్రస్థాయి నాయకుల మద్దతు కోసం.. ఎరగా.. రెండు కోట్ల విలువచేసే ప్లాట్లు
- రెవెన్యూ మున్సిపల్ అధికారులు ప్రభుత్వ స్థలమని బోర్డులు నాటారు… చర్యలు మర్చారు…
- పేపర్ లేఔట్ల పైన ప్లాట్ల విక్రయాలకు పాల్పడుతూ కోట్లు దండుకుంటున్న వైనం
- అధికారుల నిర్లక్ష్యమే బెదిరింపు చర్యలకు తావిస్తోందని స్థానికుల ఆగ్రహం
- వడ్డెర కార్మికులతో బండరాళ్ల తొలగింపుకు పాల్పడుతున్న అక్రమార్కులు
- అధికారుల కనుసన్నాల్లోనే అక్రమార్కుల ప్లాట్ల విక్రయాల తతంగం.. అనే ఆరోపణలు…
- నవరస గార్డెన్ స్థలాన్ని ప్రజా ఉద్యానవనం కోసం కేటాయించాలని.. స్థానికుల డిమాండ్
- జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి నవరస గార్డెన్ స్థలాన్ని పరిరక్షించాలని.. స్థానికుల విజ్ఞప్తి
ఒళ్ళు అలువకుండా బట్టలు నలుగకుండా సులువుగా వచ్చే సంపాదనకు అలవాటు పడిన కొందరు అక్రమార్కులు అక్రమ మార్గంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్లాట్ల రూపంలో విక్రయాలకు పాల్పడుతూ కోట్లు దండుకుంటున్నారనే ఆరోపణలు జవహర్ నగర్ స్థానికుల నుండి కోకొల్లలుగా వినిపిస్తున్నాయి మల్కాజ్గిరి జోన్ కీసర సర్కిల్ పరిధికి చెందిన జవహర్ నగర్ ప్రాంతంలో గల నవరస గార్డెన్ స్థలం నేడు కోట్లు విలువచేసే స్థలం కావడంతో ఈ నవరస గార్డెన్ స్థలం పై కన్నువేసిన కొందరు భూ కబ్జా కోర్లు దుస్సాహసానికి ఒడిగట్టి ఎలాగైనా ఎంతో విలువైన ఈ భూమిని ఆక్రమించి ప్లాట్ల రూపంలో 80 గజాల స్థలాన్ని 30 లక్షల చొప్పున అమాయక ప్రజలకు విక్రయించి దొడ్డి దారిన కోట్లు దండుకుంటున్న అక్రమార్కులపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

ఈ స్థలం కబ్జాకు గురవుతున్న వ్యవహారాన్ని గతంలో తహసిల్దార్ సుచరిత దృష్టికి తీసుకు వెళ్లడంతో తక్షణమే స్పందించిన తహసిల్దార్ సుచరిత మున్సిపల్ అధికార యంత్రాంగం తో కలిసి ఈ నవరస గార్డెన్ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తించి సూచిక బోర్డును ఏర్పాటు చేసి నవరస గార్డెన్ స్థలాన్ని కబ్జా చేసేందుకు ఎవరు సాహసించిన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది
బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ… బెదిరింపు చర్యలకు పాల్పడుతున్న అధికారులు
చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏ చోట జరిగినా స్థానిక పౌరులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వస్తే తక్షణమే అక్రమాలకు పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకోబడతాయని అవినీతి రహిత భారత్ నిర్మాణం కోసం దేశ పౌరులందరూ వారి వారి పరిసర ప్రాంతాలలో జరుగుతున్న నేరాలను అక్రమాలను తమ దృష్టికి తీసుకురావాలని అవినీతి నిర్మూలన కోసం కృషి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు చేస్తున్న ఈ తరుణంలో జవహర్ నగర్ ప్రాంతంలో జరుగుతున్న భూకబ్జాల వ్యవహారాన్ని స్వయంగా వార్తా ప్రకటనల ద్వారా రెవెన్యూ అధికార యంత్రాంగం దృష్టికి తెచ్చినప్పటికీ ఏమాత్రం స్పందించకుండా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటీ…?

అవినీతి నిర్మూలన భారత్ వద్దు… ధనార్జనే ధ్యేయంగా అక్రమ మార్గంలో దోచుకుందాం.. దాచుకుందాం.. అనే లక్ష్యంతో అక్రమాలను అక్రమార్కులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగే లంచగొండి తనమే ముద్దు.. అన్నట్లుగా అధికార యంత్రాంగం అడుగులు వేస్తోందా…? లేక… ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజాధనాన్ని జీతంగా పొందుతూ ప్రజా ప్రయోజనాత్మకమైన కార్యకలాపాలకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వాలనే విషయాన్ని మరిచి చట్టం మా చుట్టమే..
విధి నిర్వహణలో మేము ఆడిందే ఆట.. పాడిందే పాట.. మాకు ఎదురేంటి.. మేమే రాజులం.. మేమే మంత్రులం.. అనే దుస్సాహసమా…? అనే విమర్శలు స్థానికుల నుండి బాహాటంగా వినిపిస్తున్నాయి రెవెన్యూ యంత్రాంగం విధి నిర్వహణలో బాధ్యతయుతంగా విధులు నిర్వహించిన ఎడల నవరస గార్డెన్ స్థలంలో గతంలో రెవెన్యూ.. మున్సిపల్.. అధికార యంత్రాంగం సూచిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ అక్రమార్కులు అధికారుల ఆంక్షలు ఏమాత్రం లెక్కచేయకుండా ప్లాట్ల విక్రయాలతో పాటు నవరస గార్డెన్ లో వడ్డెర కార్మికులతో పెద్దపెద్ద గుండ్లు బండరాళ్ల తొలగింపు కార్యక్రమాలు ఏదేచ్ఛగా ఏలా కోనసాగుతున్నాయి అని స్థానికులు నిలదీస్తున్నారు

ప్రజా ఉద్యానవనం కోసం కేటాయించాలి
విధి నిర్వహణలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఎన్నిసార్లు నవరస గార్డెన్ స్థలం కబ్జాకు గురవుతుందని పేపర్ లేఔట్ల రూపంలో ప్లాట్లుగా ఏదేచ్ఛగా విక్రయిస్తూ కోట్లు దండుకుంటున్న అక్రమార్కులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ నవరస గార్డెన్ స్థలాన్ని ప్రజా ఉద్యానవనం కోసం కేటాయించాలని ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టి పర్వ లేనట్లు వ్యవహరించడం స్థానికులను వేదనకు గురిచేస్తుంది నవరస గార్డెన్ లో అక్రమార్కులు అధికారుల అండదండలతోనే ప్లాట్ల విక్రయాలు కొనసాగిస్తూ పేట్రేగిపోతున్నారు
అని ప్రజల నుండి వస్తున్న ఆరోపణల పట్ల జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి నవరస గార్డెన్ స్థలాన్ని ప్లాట్లుగా విక్రయించి దుస్సాహానికి పాల్పడుతున్న అక్రమార్కులపై ఈ స్థలం పరిరక్షణ విషయంలో బాధ్యతరహితంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్ జిహెచ్ఎంసి కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించి విధి నిర్వహణలో అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలిన ఎడల అధికారులపై.. స్థలం ఆక్రమణకు పాల్పడుతున్న అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకొని నవరస గార్డెన్ స్థలాన్ని ప్రజా ఉద్యానవనం కోసం కేటాయించాలని స్థానికులు మనవి చేస్తున్నారు
