- నార్సింగి పోలీసులపై మహిళ ఆరోపణ.
నన్ను శారీరకంగా,మానసికంగా వేధించిన వ్యక్తి పై పిర్యాదు చేసినా కూడా నార్సింగీ సీఐ హరి కృష్ణా రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహారిస్తూ తిరిగి నన్నే బెదిరిస్తున్నారు అంటూ స్వాతి అనే మహిళ ఆరోపణ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ… నిందుతుని తో పోలీస్ లు చేతులు కలిపి నాకు అన్యాయం చేస్తున్నారు అని ఆవేదన.
తన దగ్గర నిందితుడు బొబ్బిలి సాయి కిరణ్ కు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు ఉన్నాయని నిందితుడు తన వద్ద నుండి 30 లక్షల రూపాయలను సైతం తీసుకొని వేధిస్తున్నాడంటూ ఆరోపణ. నిందితుడి తండ్రి బొబ్బిలి ముత్యాల నాయుడు ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ కార్యకర్తగా చలామణి అవుతూ తాను ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళినప్పుడు బెదిరించే ప్రయత్నం చేశారని ఆరోపణ. నిందితుడికి సంబంధించి ఫోటోలు వీడియోలు, వీడియో కాల్స్ కూడా తన వద్ద ఉన్నాయంటూ అన్ని ఆధారాలు ఉన్నా కూడా తనకు న్యాయం చేయకుండా పోలీసులు తాచ్చారం చేస్తున్నారని ఆరోపణ.
