- నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ రెడ్డి
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి,మిల్లులకు తరలించాలని నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు.చిలిపిచేడ్ మండలంలోని శీలంపల్లి రైతు వేదిక వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆర్డీఓ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ…తేమ వచ్చిన ధాన్యాన్ని వెంటనే కాంటా వేసి,రైస్ మిల్లకు తరలించాలన్నారు. కొనుగోలు వివరాలను ఆనలైనలో నమోదు చేయాలని,రైతులకు 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా చూడాలని ఆదేశించారు.
రైతులకు అవసరమైన టార్ఫాలిన,తూకం యంత్రాలు అందుబాటులో ఉంచాలన్నారు.మిల్లుల వద్ద లారీలను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు దించుకొని,లోడింగ్ సమస్యలు లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు.గ్రేడ్ ఏ ధాన్యానికి రూ.2,389,కాగా బి గ్రేడ్ కు రూ.2369 మద్దతు ధర మీద కొనుగోలు చేయాలని సూచించారు. రైతులను డబ్బులు ఎవరూ అడిగినా ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. అధికారులు కొనుగోలు కేంద్రాలను సందర్శించి,రైతుల ఇబ్బందులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.ఆయన వెంట ఎమ్మార్వో సహదేవ్,ఆర్ఐ సునీల్ చౌహన్,రెవెన్యూ సిబ్బంది,రైతులు ఉన్నారు.
