Tuesday, February 10, 2026
Homeనల్లగొండCampaign | యాదగిరిగుట్ట పట్టణంలో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం..

Campaign | యాదగిరిగుట్ట పట్టణంలో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం..

  • పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా పట్టణంలోని 9వ, 10వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన గడప గడపకు వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకొని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

గత పాలనలో జరిగిన లోపాలను ప్రజలకు గుర్తు చేస్తూ, ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న ప్రజాపాలన ద్వారా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. స్థానిక అభ్యర్థులకు ప్రజల మద్దతు లభిస్తే పట్టణ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే అయిలయ్య హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News