Saturday, March 21, 2026
Homeబిజినెస్Tirumala | తిరుమల శ్రీవారి సేవలో ముఖేష్ అంబానీ

Tirumala | తిరుమల శ్రీవారి సేవలో ముఖేష్ అంబానీ

అత్యాధునిక వంట గదిని అన్న ప్రసాదం ట్రస్ట్‌కు అంకితం చేస్తున్నట్లు ప్రకటన

దిగ్గజ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ (Mukesh Ambani) ఆదివారం తిరుమల శ్రీవారి(Srivaru)ని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి (Srivenkateshwara Swami) ఆశీస్సులతో తిరుమలలో అత్యాధునిక వంట గది (Kitchen) నిర్మాణాన్ని అన్న ప్రసాదం ట్రస్ట్‌కు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పవిత్ర కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భాగస్వామ్యంతో, రాష్ట్ర ప్రభుత్వ (State Government) సహకారంతో చేపడుతున్నారు. కొత్త వంట గదిలో అధునాతన ఆటోమేషన్‌(Automation)ను ప్రవేశపెట్టారు. దీంతో.. రోజూ 2 లక్షల మందికి పైగా భక్తులకు భోజనాలను తయారు చేసి వడ్డించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

- Advertisement -

తిరుమల.. విశ్వాసానికి, సేవకు శాశ్వత చిహ్నంగా నిలుస్తోందని ముఖేష్ అంబానీ అన్నారు. టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో అన్నసేవా సంప్రదాయం విస్తరించాలనే సీఎం చంద్రబాబు (CM Chandrababu) దార్శనికతను మెచ్చుకున్నారు. ఏ ఒక్క భక్తుడూ ఆకలితో ఉండకూడదనే శ్రీ వెంకటేశ్వరుని దైవిక లక్ష్యానికి తోడ్పడటాన్ని గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. టీటీడీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. కేరళ త్రిస్సూర్‌లోని గురువాయూర్ శ్రీ కృష్ణ ఆలయాన్ని కూడా ముఖేష్ అంబానీ సందర్శించారు. ఆయన గుడికి రూ.15 కోట్లు విరాళంగా ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News