Thursday, March 26, 2026
Homeవరంగల్‌Disha | ‘దిశ’ మీటింగ్‌లో ఎంపీ కావ్య

Disha | ‘దిశ’ మీటింగ్‌లో ఎంపీ కావ్య

డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ(Disha) సమావేశంలో వరంగల్ ఎంపీ (Warangal Mp), కమిటీ చైర్మన్ (Committee Chairman) డాక్టర్ కడియం కావ్య (Kadiyam Kavya) పాల్గొన్నారు. భూపాలపల్లి (Bhupalapally) కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ జరిగిన ఈ మీటింగ్‌లో కలెక్టర్ రాహుల్ శర్మ, శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణరావు (Mla Gandra Satyanarayana Rao) తదితరులు పాల్గొన్నారు. వివిధ విభాగాల పనితీరుపై సమీక్ష జరిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఫోకస్ పెట్టాలని అధికారులకు సూచించారు. జిల్లాలో పుష్కలంగా ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని డెవలప్‌మెంట్ సాధించాలని అన్నారు. సాధారణ ప్రసవాలు ప్రస్తుతం 55 శాతం మాత్రమే ఉండగా వాటిని పెంచాలని చెప్పారు. పూర్తి వివరాలతో రావాలని జిల్లా విద్యాధికారి(Deo)ని ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News