ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఆయన బయోపిక్
నర్సయ్య పాత్రలో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్
ప్రజల మనిషి.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన నాయకుడు.. పదవిలో ఉన్నా హంగూ ఆర్భాటం లేకుండా సామాన్య జీవితం గడిపి ప్రతిఒక్కరికీ ఆదర్శంగా నిలిచిన మహోన్నతుడు.. మాజీ ఎమ్మెల్యే (Former Mla) గుమ్మడి నర్సయ్య. 5 సార్లు శాసన సభ్యుడిగా ఎన్నికైనా సైకిల్(Cycle)పైనే ప్రయాణం సాగిస్తూ విలాసవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి ప్రజలతో కలిసి ఉన్న నాయకుడు (Leader) గుమ్మడి నర్సయ్య. ఆయన జీవిత చరిత్రను సినిమా (Cinema) రూపంలో ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు.
ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ (Pravallika Art Creations) బ్యానర్‌పై గుమ్మడి నర్సయ్య బయోపిక్ రూపొందనుంది. సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగనుంది. సంబంధిత వివరాలను సినిమా నిర్మాత, శ్యామల గోపాలన్ ఎడ్యుకేషన్ చైర్మన్ నల్లా సురేష్ రెడ్డి వెల్లడించారు. గుమ్మడి నర్సయ్య బయోపిక్(Biopic)లో కన్నడ సూపర్ స్టార్ (Kannada Super Star) శివరాజ్ కుమార్ (Shivaraj Kumar) నటించనున్నారు. పాల్వంచ పెద్దమ్మగుడి వద్ద ఉన్న హెచ్-కన్వెన్షన్ హాల్‌లో షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో శివరాజ్‌కుమార్‌తోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొంటారు.
గుమ్మడి నర్సయ్య మచ్చలేని రాజకీయ జీవితాన్ని ఇప్పుడున్న ప్రజలకు చూపించాలని, ఆయన లాంటి నాయకుడు ప్రజలకు సేవ చేయాలన్న మనసున్న నాయకులు రావాలనే సంకల్పంతో ఈ సినిమాకు నిర్మాతగా చేస్తున్నట్లు తెలిపారు. ఇల్లందు ఏరియాకు చెందిన గుమ్మడి నర్సయ్య గొప్ప వ్యక్తి కాబట్టి ఆయనపై సినిమా షూటింగ్‌కు పాల్వంచలోనే ప్రారంభో త్సవం చేయదలిచామని అన్నారు. ఈ సినిమా తదుపరి షూటింగ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉంటుంది.

