Wednesday, March 25, 2026
Homeనల్లగొండMothkur | ముగిసిన మోత్కూరు మున్సిపల్ ఎన్నికల పోలింగ్

Mothkur | ముగిసిన మోత్కూరు మున్సిపల్ ఎన్నికల పోలింగ్

మోత్కూర్ మున్సిపాలిటీ రెండవ సాధారణ ఎన్నికలు బుధవారం సాయంత్రం 5 గం.లకు ముగియగా ,17 పోలింగ్ కేంద్రాల్లో ఉన్న 26 సెంటర్ లో నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తో కలిపి ఓటింగ్ శాతం 86.92 గా నమోదయింది.మొత్తం మున్సిపాలిటీ 12 వార్డుల ఓటర్లు మొత్తం 14383 ఉండగా 12502 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పోస్టల్ బ్యాలెట్ తో కలిపి పురుషులు 6187, మహిళలు 6315 ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం భద్రత సిబ్బందితో బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంకు తరలించారు. ఈనెల 13 శుక్రవారం ఉదయం 8 గం.ల నుండి ఓట్ల లెక్కింపు ఉండగా,16న మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News