Tuesday, February 10, 2026
Homeరంగారెడ్డిMoinabad | మొయినాబాద్ ఉపసర్పంచ్‌ల ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక

Moinabad | మొయినాబాద్ ఉపసర్పంచ్‌ల ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక

  • అధ్యక్షులుగా అవిశిపేట ఆంజనేయులు గౌడ్
  • ఉపాధ్యక్షులుగా టీ జితేందర్ రెడ్డి

మండల ఉపసర్పంచ్‌ల ఫోరం నూతన కార్యవర్గాన్ని మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల అభివృద్ధిలో ఆయా గ్రామాల ఉప సర్పంచ్ ల పాత్ర కీలకంగా మారనుందని, అందుకు తగ్గ కార్యాచరణతో రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మొయినాబాద్ మండల ఉప సర్పంచ్ ల ఫోరం ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అధ్యక్షులు అవిశిపేట ఆంజనేయులు గౌడ్, ఉపాధ్యక్షులు టీ జితేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఫోరం ప్రధాన కార్యదర్శిగా ఆలూరి రవీందర్, కార్యదర్శులుగా గోటూరి అనిత, ఆలూరి శ్రీనివాస్, కోశాధికారిగా మేన్ రెడ్డి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా సోమ నరేష్ యాదవ్, కుమ్మరి రాజు, సలహాదారుగా గౌండ్ల నిరంజన్ గౌడ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News