బంగ్లాదేశ్ మాజీ ప్రధాని(Bangladesh Former PM) బేగం ఖలీదా జియా(Begum Khaleda Zia) మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ(India PM Modi) తీవ్ర సంతాపం(Deepest Condolences) వ్యక్తం చేశారు. సంతాప లేఖను ప్రధాని మోదీ తరఫున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్(External Affairs Minister Jaishankar) జియా పెద్ద కుమారుడు తారిఖ్ రెహ్మాన్(Tarique Rahman)కి అందజేశారు. బుధవారం జియా అంత్యక్రియల(Funeral)కు హాజరయ్యేందుకు ఢాకా చేరుకున్న ఆయన నేరుగా తారిఖ్ వద్దకు వెళ్లి కలిశారు.
తారిఖ్ ప్రస్తుతం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(Bangladesh Nationalist Party)కి కార్యనిర్వాహక చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. మూడు దశాబ్దాలకు పైగా బంగ్లాదేశ్ రాజకీయాలను శాసించిన దిగ్గజ నాయకురాలు జియా మరణం పట్ల భారతదేశ ప్రజలు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు ప్రధాని తన లేఖలో పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచిన తమ ప్రియతమ నేత బేగం ఖలీదా జియాకు బంగ్లాదేశ్ ప్రజలు బాధాతప్త హృదయంతో వీడ్కోలు పలుకుతున్నారు. ఆమె భౌతిక కాయాన్ని కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
