Monday, February 16, 2026
Homeరంగారెడ్డిYellampet | ఎవరైనా కోడ్ ని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

Yellampet | ఎవరైనా కోడ్ ని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

  • సి ఐ సత్యనారాయణ

ఎన్నికల నిబంధనలు పాటుంచాలని మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందని మేడ్చల్ సిఐ అద్దాని సత్యనారాయణ అన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంకా అమలులో ఉందని గెలుపొందిన అభ్యర్థులు గాని లేదా వారి అనుచరులు గాని ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు సమ్మేళనాలు నిర్వహించరాదని అన్నారు.

ఇట్టి ఎన్నికల నియమావళి 16వ తారీకు మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందన్నారు. ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగేంత వరకు కోడ్ అమలులో ఉంటుందని అప్పటివరకు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదన్నారు. ఎవరైనా కోడ్ ని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు అని సి ఐ సత్యనారాయణ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News