Tuesday, February 10, 2026
Homeమహబూబ్‌నగర్‌Wanaparthy MLA | ప్రజల ఆకాంక్ష మేరకు గల్లి నుండి అభివృద్ధి మొదలు.

Wanaparthy MLA | ప్రజల ఆకాంక్ష మేరకు గల్లి నుండి అభివృద్ధి మొదలు.

  • ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో 54 కోట్లతో సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం.
  • ప్రభుత్వంపై ప్రజలు నమ్మకంతో ఉన్నారు.
  • వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి..

ప్రజల ఆకాంక్ష మేరకు గల్లీ నుండి అభివృద్ధిని మొదలుపెట్టామని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు. బుధవారం 33 వార్డులో శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని, పుర ఎన్నికలో భాగంగా 33, 24 వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మిడిదొడ్డి మాధవి ఎస్ఎల్ఎన్ రమేష్, జయమ్మ శ్రీనివాసులు లకు మద్దతుగా వార్డులలో ఇంటింటికి తిరిగి చేతి గుర్తుపై ఓటేసి అత్యధిక భారీ మెజారిటీతో వారిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పదేళ్లలో బిఆర్ఎస్ అభివృద్ధి పేరుతో దోచుకుని దాచుకుందని విమర్శించారు. రెండు మూడు బంగ్లాలు కట్టి రోడ్ల మధ్యలో డివైడర్లు ఏర్పాటుచేసి మినీ ట్యాంక్ బండ్ల పేరుతో చెరువులకు రెండు సైడ్లు రిబిట్ మెంట్ నిర్మించి అదే అభివృద్ధి అని అబద్ధపు ప్రచారాలు చేస్తూ పట్టణ ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో పట్టణ ప్రజల ఆకాంక్ష మేరకు 54 కోట్లతో పట్టణంలోని ప్రతి గల్లీలో సిసి రోడ్లు నిర్మించి..

- Advertisement -

గల్లి స్థాయి నుండి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు. వార్డులలో డ్రైనేజీ, విద్యుత్, వీధి దీపాల వంటి సమస్యలు ఉన్నాయని అన్నారు. ప్రత్యేకంగా విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు 40 కోట్లు కేటాయించామని త్వరలోనే విద్యుత్తు సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఉచిత విద్యుత్, ఉచిత ప్రయాణం, రేషన్ కార్డులు, సన్న బియ్యం, బోనస్, రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీ, 500 లకే సిలిండర్ వంటి పథకాలు ప్రజలకు అందిస్తూ..

వనపర్తి పట్టణానికి 864 కోట్ల తో ఇంటిగ్రేటెడ్ పాఠశాల, ప్రభుత్వ హాస్పిటల్, పాలిటెక్నిక్ కళాశాల వసతి గృహాలు, వనపర్తి కీర్తి కిరీటం రాజా గారి బంగ్లా పునర్వీకరణ, ఐటీ టవర్ వంటి వాటితో పట్టణ అభివృద్ధినీ సాధిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పై నమ్మకంతో మున్సిపల్ ఎన్నికలో బ్రహ్మరథం పడుతున్నారని .. వనపర్తి పట్టణంలో 33 వార్డులకు 33 క్వీన్ స్లిప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News