- ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి..
వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి గురువారం వనపర్తి పట్టణంలోని నంది హిల్స్ 30 వ వార్డులో మార్నింగ్ వాక్ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలనీ వాసులతో కలిసి నడక సాగించారు. నంది హిల్స్ పార్కు లో నిర్మిస్తున్న సామూహిక భవన నిర్మాణ పనులను పరిశీలించారు.
టిఎంఆర్ స్విమ్మింగ్ పూల్ ప్రాంతంలోని రోడ్ల వెంట నడక సాగించిన ఎమ్మెల్యే ఆ ప్రాంతంలో సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. కరెంటు స్తంభాలు, వీధిలైట్ల ఏర్పాటు, మురికి కాలువల నిర్మాణం లాంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి కాలనీని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు.

వనపర్తి లో రాజకీయాలకి అతీతంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, పట్టణాభివృద్ధిలో రాజకీయాలు ఒక చిన్న భాగమే తప్ప అభివృద్ధికి ఆటంకాలు కాకూడదన్న సంకల్పంతో ముందుకెళుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు స్థానిక పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.
