Homeమహబూబ్‌నగర్‌MLA | అసలోడే పోయిండు… కోసరోడు ఏం అభివృద్ధి చేస్తారు?.

MLA | అసలోడే పోయిండు… కోసరోడు ఏం అభివృద్ధి చేస్తారు?.

  • నెంబర్ 1, నెంబర్ 4 అనే వారు ఫామ్ హౌస్ కే పరిమితం.
  • కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి.
  • వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి…

రాష్ట్రంలో, జిల్లాలో అసలోలే పోయారు. ఇక్కడున్న కోసరోళ్ళు ఏం అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఘనపురం మండలం సోలిపురం, గోపాల్ పేట మండలం బుద్ధారం, పోలికపహాడ్ గ్రామాలలో తోపాటు గోపాల్ పేట కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలు, సర్పంచ్ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నంబర్ 1, నెంబర్ 4 అనే చెప్పుకునే వాళ్ళను ప్రజలు ఫామ్ హౌస్ కే పరిమితం చేశారని, మిగిలిన కొసరుగాళ్లు గెలిచి ఎం అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు.

MLA Megha Reddy Political Criticism 11

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే గ్రామాల లో నెలకొన్న సమస్యలకు కావలసిన అత్యధిక నిధులు మంజూరు చేయించి సమస్యలు పరిష్కరించి గ్రామాలను అభివృద్ధి వైపు మళ్ళిస్తామని హామీ ఇచ్చారు. పదేళ్లలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించామని అన్నారు. గ్రామాలలో సిసి రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. ప్రచార కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు డాక్టర్ పగడాల శ్రీనివాస్, కొంకి వెంకటేష్, గోపాల్ పేట అధ్యక్షుడు శ్రీనివాసులు, శేఖర్, సర్పంచ్ అభ్యర్థి సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

MLA Megha Reddy Political Criticism 1
- Advertisement -
RELATED ARTICLES

Latest News