Tuesday, February 10, 2026
Homeమహబూబ్‌నగర్‌Republic Day | జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి..

Republic Day | జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి..

గణతంత్ర దినోత్సవ సందర్భంగా వనపర్తి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గారు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన వనపర్తి నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు చీర్ల విజయ్ చందర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, పిసిసి సభ్యులు శంకర్ ప్రసాద్, మాజీ కౌన్సిలర్ లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News