- నాటి ఏఈని నిలదీసిన మాజీ సర్పంచ్, కాంట్రాక్టర్…
- నేను వేరే డిపార్ట్మెంట్ కు పోయానని నా చేతిలో ఏమీ లేదని తేల్చేసిన ఏఈ రాజ్ కుమార్
ఏడేళ్ల క్రితం 100% మిషన్ భగీరథ కార్యక్రమంలో ఇంటింటికీ నల్లాలు ఇచ్చి సంబంధిత పంచాయతీ కార్యదర్శులతో సర్టిఫికెట్లు తీసుకొని మిషన్ భగీరథ ఏఈ, డీఈ లకు అప్పగించిన ఇప్పటివరకు పూర్తిస్థాయి బిల్లులు ఇవ్వకుండా నరకం చూపిస్తున్నారని వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని రామారం మాజీ సర్పంచ్ కొడారి రవి, మిషన్ భగీరథ కాంట్రాక్టర్ బైరి తిరుపతిరెడ్డి ఏఈ రాజకుమార్ ను నిలదీశారు. ఈ సందర్భంగా నర్సంపేట పట్టణంలోని మిషన్ భగీరథ డి ఈ కార్యాలయంలో ఏడేళ్ల క్రితం మిగిలిన మెటీరియల్ మెటీరియల్ను డీఈ కార్యాలయానికి అప్పగిస్తున్న క్రమంలో అప్పుడు ఏఈగా నర్సంపేట మండలంలో పనిచేసిన రాజకుమార్ రావడంతో నానా రభస జరిగింది.
ఈ సందర్భంగా రామారం సర్పంచ్ కొడారి రవి, మిషన్ భగీరథ కాంట్రాక్టర్ బైరి తిరుపతిరెడ్డిలు ఏఈ రాజకుమార్ ను నిలదీస్తూ, 2017లో ప్రారంభమైన మిషన్ భగీరథ పథకంలో నర్సంపేట మండలంలో లక్నే పెళ్లి సెక్టార్ కింద కాంట్రాక్టు చేసి లక్న పెళ్లి తో పాటు రామారం మరి నరసయ్య పల్లి తదితర గ్రామాలలో 100% పనులు పూర్తి చేసి ఇంటింటికి నల్లాలు ఇచ్చి ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో 100% పనులు పూర్తయినట్లు సర్టిఫికెట్ సైతం అధికారులకు ముట్ట చెప్పినప్పటికీ ఆరేళ్లుగా మిగిలిపోయిన బిల్లు ఇవ్వకుండా చెప్పులు అరిగేలా తిరిగిన కనికరించకుండా ఇన్నాళ్లు జరుపుతూ వస్తున్నారన్నారు. గత నెల రోజుల క్రితం మిషన్ భగీరథ డి ఈ, ఎస్ ఇ, ఈ ఈ, ఈ లను నిలదీయగా నర్సంపేట మండలం లో అప్పుడు పని చేసిన ఏఈ ద్వారానే బిల్లులు చెల్లించబడతాయని ప్రస్తుతం ఆయన మిషన్ భగీరథ స్కీం నుండి రిలీవై పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి వెళ్ళాడని తద్వారా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారని బాధిత కాంట్రాక్టర్లు వాపోయారు.
పనులు జరుగుతున్నప్పుడు ఏ ఈ పూర్తిస్థాయి ఎంపీ రికార్డులు చేయకుండా మాకు బిల్లులు ఇవ్వకుండా ఇతర డిపార్ట్మెంట్ కు బదిలీపై వెళ్లి ఆరేళ్ల తర్వాత ఇప్పుడు ఎలా మెటీరియల్ రికవరీ చేసుకుంటాడని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. అప్పు సబ్బులు చేసి 100% పనులు చేస్తే బిల్లులు ఇవ్వకుండా మిషన్ భగీరథ అధికారులు ప్రాణాలు తింటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి పనులు జరిగాక మిగిలిన మెటీరియల్ను మూడేళ్ల క్రితమే అధికారులకు అప్పగించినప్పటికీ ఇప్పుడు డీఈ ఆఫీసుకు ఎందుకు ముట్ట చెబుతున్నారని ఇందులో అధికారుల నిర్లక్ష్య పాత్ర ఉండడంతోటే పనులు చేసిన కాంట్రాక్టర్లకు ప్రాణ సంకటనoగా మారిందన్నారు. ఏఈ నిర్లక్ష్యమూలంగా బిల్లులు రాకపోవడంతో చేసిన అప్పులకు మిత్తిలు కట్టలేక ఉన్న భూములు అమ్ముకోవాల్సివచ్చిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిల్లుల సంగతి నాకు తెలవదు పనులు చేసినంతవరకు ఎమ్మెల్యేలు చేశాను::: ఏఈ రాజకుమార్
2019 నుండి 2021 వరకు మిషన్ భగీరథ పథకంలో పనులు చేసిన ప్రతి కాంట్రాక్టర్కు ఎంబీలు చేసి 80% బిల్లు ఇచ్చామని ఆపై 2021లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కు వెళ్లానని నా చేతిలో ఇప్పుడు ఏమీ లేదని ఇప్పుడున్న అధికారులే మిగతా బ్యాలెన్స్ బిల్లు ఇవ్వాల్సి ఉంటుందని అప్పటి మిషన్ భగీరథ ఏఈ రాజకుమార్ స్పష్టం చేశారు. పనులు చేసినప్పుడు బ్యాలెన్స్ మెటీరియల్ అధికారులకు అప్పగించడం జరగలేదని నర్సంపేట దుగ్గొండి మండలాల్లో నేను పనిచేసినప్పుడు మిగిలిన మెటీరియల్ ఈరోజు అప్పగించడం జరుగుతుందని బ్యాలెన్స్ బిల్లు సంగతి ఇప్పుడు మిషన్ భగీరథలో పనిచేసే అధికారులకు తెలుస్తుందని ఏఈ వివరించారు. ఐదేళ్ల క్రితం రిలీవ్ అయిన ఏ ఈ ఇప్పుడు మెటీరియల్ అప్పగించడంపై ఎంత నిర్లక్ష్యం దాగి ఉందని బాధిత కాంట్రాక్టర్లు అసహనం వ్యక్తం చేశారు.
