స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్‌లు కోరుతూ హైదరాబాద్‌లోని ముషీరాబాద్ బస్ డిపో వద్ద జరిగిన బంద్‌లో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఆయనతోపాటు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, రాజ్యసభ ఎంపీ, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. బీసీలకు వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలుకావాలని ఆకాంక్షించారు. బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా జరిగింది.
SRIHARI: బీసీ బంద్‌లో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి
RELATED ARTICLES
- Advertisment -
