హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Andesri) సంతాప సభ(Condolence meeting)లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. అందెశ్రీ తన పాటల(Songs)తో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి(Telangana movement spirit)ని నింపారని చెప్పారు. 2009లో 15వ లోక్‌సభ(Lok Sabha)లో తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఉద్యమ స్ఫూర్తిని నింపటం తద్వారా తెలంగాణ సాధనకు మూల కారకులుగా నిలిచి జీవితాన్ని కొనసాగించారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ పాటలు మనందరికీ స్ఫూర్తిదాయకంగా (Inspirational) నిలిచాయని పేర్కొన్నారు.

‘అందెశ్రీకి సముచిత గౌరవాన్ని ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. ఆయన జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చడంతోపాటు వారు రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని శాశ్వతంగా తెలంగాణ ప్రజలు ఆచరించేలా రాష్ట్ర గీతంగా ప్రకటించారు. సీఎం మాట ప్రకారం అందెశ్రీ స్మారక స్తూపాన్ని హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాను. తెలంగాణ కళాకారులు అందెశ్రీ స్ఫూర్తిని భవిషత్ తరాలకు తెలిసేలా తెలంగాణ ఐక్యతకు, ప్రజా ప్రభుత్వానికి నిండు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నా’ అన్నారు.
