Thursday, March 26, 2026
Homeఫోటోలుసచివాలయంలో సామాన్యులను కలిసిన మంత్రి లోకేష్

సచివాలయంలో సామాన్యులను కలిసిన మంత్రి లోకేష్

ప్రజల నుంచి వినతుల స్వీకరణ

అమరావతిలోని సచివాలయం నాలుగో బ్లాక్‌లో తన చాంబర్‌కు వచ్చిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన కోసం వేచి ఉన్న సామాన్యులను కలిశారు. వివిధ సమస్యలపై తన చాంబర్ కు వచ్చిన దాదాపు 150 మందిని కలుసుకున్నారు.

- Advertisement -

ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి వినతిని పరిశీలించిన మంత్రి లోకేష్.. త్వరితగతిన సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తానని వారికి హామీ ఇచ్చారు. దీంతో వారంతా ఆనందంగా వెనుదిరిగారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News