Wednesday, February 11, 2026
Homeస్పోర్ట్స్Youth | తప్పనిసరిగా క్రీడలను ఎంచుకోవాలి

Youth | తప్పనిసరిగా క్రీడలను ఎంచుకోవాలి

మాదకద్రవ్యాల వినియోగాన్ని కాదు
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచన

యువత(Youth) తప్పనిసరిగా క్రీడల(Sports)ను ఎంచుకోవాలని, మాదకద్రవ్యాలను కాదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman Kumar) సూచించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన 19వ రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) అండర్-19(Under-19) లీగ్(League) టీ20 ఛాంపియన్‌షిప్(T20 Championship)-2026 ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. యువత మాదకద్రవ్యాలకు, అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. క్రమశిక్షణతో కూడిన ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం క్రీడలను ఎంచుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడలపై దృష్టి సారించిందని చెప్పారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ(Young India Sports University) భవిష్యత్ ఛాంపియన్‌లను తయారుచేయడానికి, తెలంగాణను జాతీయ, ప్రపంచ క్రీడా కేంద్రంగా మార్చడానికి ఒక చారిత్రాత్మక అడుగు అని ఆయన పేర్కొన్నారు. 12 రాష్ట్రాల నుంచి జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్‌ను గెలుచుకున్నందుకు హైదరాబాద్ జట్టును మంత్రి అభినందించారు. ప్రభుత్వ మద్దతుతో క్రీడల్లో రాణించినందుకు గురుకుల విద్యార్థులను ప్రశంసించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News