అన్నీ టెండర్లు ఆ ఒక్క కంపెనీకే ఒకటి కాదు.. రెండు కాదు.. స్మార్ట్ సిటీ పనుల్లో ఏ టెండర్ వచ్చిన సొంతం చేసుకుంటూ.. మొదటి అంచనాలను పెంచుకుంటూ కోట్ల ప్రజాధనంను వెనక్కేసుకుంటూ అక్రమాలకు పడగలెత్తింది.. ఆ కంపెనీ పేరు ఏంటంటారా మంద ఐలయ్య కన్‌స్ట్రక్చన్ ప్రైవేట్ (ఎమ్ఐహెచ్) లిమిటెడ్.. ఇదంతా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నీలి నీడలో జరుగుతుంది.. ఇందులో ఎవరి ఎవరి చేతులున్నాయో…?
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ సిటీ పథకంలో వరంగల్ లిస్ట్ అయిన సంగతి విధితమే. అభివృద్ధి పనుల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసే ప్రతి టెండర్ తాలుకూ సమాచారం ఎక్కడ కూడా ఇవ్వకపోయినా.. ఎంఐహెచ్ కంపెనీకి ఆ టెండర్లు ఎలా దక్కేవి..? అలా టెండర్లు ఒక్క కంపెనీకి దక్కేందుకు ఎవరెవరు ఎంత మొత్తంలో ముడుపులు అందుకుంటున్నారు..!
భద్రకాళి చెరువు, వడ్డేపల్లి చెరువుల సుందరీకరణ, ఉర్సు గట్టు చెరువు కట్ట నిర్మాణం, నాలాల మీద కల్వర్టుల నిర్మాణం.. ఇలా ప్రతి టెండర్ మంద ఐలయ్య కన్‌స్ట్రక్చన్ ప్రైవేట్ లిమిటెడ్ సొంత చేసుకొని.. టెండర్ వాల్యూనూ పెంచుకుంటూ కోట్ల డబ్బును ఖర్చు బెట్టారు.. దాదాపు 80 కోట్ల రూపాయాల అంచనా కలిగిన టెండర్ల విలువను దాదాపు 150 కోట్లకు పెంచుకున్నారు. అలా పెంచె అధికారం ఎవరిచ్చారు..? దేనిని ఆధారం చేసుకొని టెండర్ అంచనా పెంచారు.
దీని వెనకలా ఎవరి హస్తం ఉంది.. అంచనాలను పెంచిన అదే కంపెనీకి పనులు అప్పగించడంలో మతలబేంటి.. అధికారులు, కాంట్రాక్టర్ మంద అశోక్ కుమ్మక్కు అయ్యారనీ ప్రజలు ఆరోపిస్తున్నారు..! జరుగుతున్న అవినీతిపై విచారణలు జరపాలనీ డిమాండ్ చేస్తున్నారు.. ఇది ఆరంభం మాత్రమే.. మరో కథనంతో మంద ఐలయ్య కన్‌స్ట్రక్చన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేపట్టిన ప్రతి కాంట్రాక్ట్ అవినీతిపైనా “ఆదాబ్ హైదరాబాద్” లోతైన సమాచారం, పూర్తి ఆధారాలతో మీ ముందుకు తెస్తుంది..
